తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే ఈయన సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా( Pushpa Movie ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి ఈయన ఈ సినిమా ద్వారా తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు ( National Award )కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.గత మూడు రోజుల క్రితం ఈయన ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపతి చేతుల మీదుగా ఈ నేషనల్ అవార్డు అందుకున్నారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అల్లుఅర్జున్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి జాతీయ అవార్డును ఏ హీరో కూడా అందుకోకపోవడం గమనార్హం.

ఇలా మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్నటువంటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు.ఇక ఈ హీరో నేషనల్ అవార్డు అందుకోవడంతో ఎంతోమంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రత్యేకంగా ఆయనను కలిసి అభినందించారు.అయితే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఇలాంటి మంచి గుర్తింపు సంపాదించుకోవడం ఒక టాలీవుడ్ హీరో కి ఏమాత్రం డైజెస్ట్ కాలేదట.కనీసం ఆయనకి విష్ చేయకపోవడమే కాకుండా అల్లు అర్జున్ ఈ నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఫోటోలు అన్ని పేపర్లలో రావడంతో ఆ పేపర్లు చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారట.

తనకంటే వెనక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఆ హీరో ఇలా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇంత మంచి అవార్డులను కూడా అందుకోవడంతో ఆ హీరో సహించలేకపోయారు.అల్లు అర్జున్ పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫోటోలు ఉన్నటువంటి పేపర్లన్నింటిని కూడా కాల్చి తన కోపాన్ని తగ్గించుకున్నారని తెలుస్తుంది.ఇలా ఒక హీరో ఇండస్ట్రీలో సక్సెస్ అయితే ఓర్చుకోలేనితనం ఆ హీరోకి ఉండడంతో ఇలా ప్రవర్తించారని తెలుస్తుంది.అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సాటి హీరో ఇలాంటి సక్సెస్ అందుకుంటే అభినందించాల్సింది పోయి ఇలా బాధపడటం దేనికి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఆ హీరో అల్లు అర్జున్ తో చాలా చనువుగా ఉంటూనే ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారనీ చెప్పాలి.