నార్త్ అమెరికాలో వ్యాపార విస్తరణ.. భారతీయ టెక్ సంస్థలకు నాస్కామ్ చేయూత..!!

ఐటీ, ఐటీ సేవల విషయంలో భారతీయ టెక్ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది.ఎన్నో దేశాల్లో మన కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ.

కొన్ని చోట్ల ఇంకా పుంజుకోవాల్సిన అవసరం వుంది.ఈ నేపథ్యంలోనే నార్త్ అమెరికా మార్కెట్‌లో భారతీయ టెక్ సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు గాను నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) రంగంలోకి దిగింది.

ఈ మేరకు కెనడాలో ‘‘లాంచ్‌ప్యాడ్’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నాస్కామ్ తెలిపింది.ఇది నాస్కామ్‌లో మెంబర్స్‌గా వున్న కంపెనీలకు హోమ్ బేస్‌గా ఉపయోగపడుతుందని అసోసియేషన్ అభిప్రాయ పడింది.

ఆరు నెలల వరకు అద్దె లేకుండా కార్యాలయ స్థలం, మార్కెట్ అవకాశాలపై అవగాహనను పెంచడం, సైట్ ఎంపికలో సహాయం, ప్రభుత్వ నిబంధనలు, ప్రోత్సాహకాలు, ఆ ప్రాంతంలో శాశ్వత కార్యకలాపాలను ప్రారంభించేందుకు పన్ను ప్రణాళికలో సాయం చేయడం ‘‘లాంచ్‌ప్యాడ్’’ ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు.తద్వారా రానున్న నాలుగేళ్లలో కెనడాలో దాదాపు 20 కంపెనీలు 200 ఉద్యోగాలను సృష్టిస్తాయని నాస్కామ్ అభిప్రాయ పడింది.

Advertisement

న్యూబ్రూన్స్‌ విక్, నోవాస్కోటియా, సిటీ ఆఫ్ బ్రాంప్టన్‌ల భాగస్వామ్యంతో నాస్కామ్.ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేయనుంది.

ఇకపోతే.టెక్ స్టార్టప్‌లను ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో అనుసంధానించేందుకు ఇప్పటికే నాస్‌కామ్ నడుం బిగించిన సంగతి తెలిసిందే.ఇందుకోసం ఉద్దేశించిన డీప్ టెక్ క్లబ్ (డీటీసీ) 2.0ను గతేడాది ప్రారంభించింది.ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఏఆర్, వీఆర్, ఐఓటీ, రోబోటిక్స్, బ్లాక్ చెయిన్ తదితర టీప్ టెక్నాలజీల ఆధారంగా పనిచేసే స్టార్టప్‌ల కోసం ఈ మెంటారింగ్ ప్రోగ్రామ్‌లో సెకండ్ ఎడిషన్‌ను ప్రారంభించింది.

ఇందుకోసం అడ్వాన్స్‌డ్ టెలి కమ్యూనికేషన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (జపాన్), డల్లాస్ వీసీ (అమెరికా)లతో నాస్‌కామ్ ఒప్పందం కుదుర్చుకుంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement
" autoplay>

తాజా వార్తలు