NASA: నాసా షేర్‌ చేసిన ఫోటోని చూసి ప్రమాదం పొంచి వస్తోందని చెబుతున్న శాస్త్రవేత్తలు... విషయమిదే!

తాజాగా నాసా షేర్‌ చేసిన ఫోటోని చూసి ప్రమాదం పొంచి వస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.తాజాగా నాసా ఉపగ్రహం ఈ వారం సూర్యుని చిత్రాన్ని క్యాప్షన్‌ చేసింది.

 Nasa Solar Observatory Captures The Sun Smiling Pic Details, Nasa , Photos, Shar-TeluguStop.com

ఇది చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఎందుకంటే ఇందులో సూర్యుడు నవ్వుతున్నట్లుగా చాలా స్పష్టంగా కనబడుతోంది.

తాజాగా సదరు నమూనా చిత్రాన్ని నాసా విడుదల చేసింది.ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు, US స్పేస్ ఏజెన్సీ దీనిని స్మైలింగ్ సన్ అంటూ క్యాప్షన్‌ ఇవ్వడం కొసమెరుపు.

కాగా సూర్యుడు నవ్వుతున్న ముఖంతో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మరోవైపు, నాసా ఈ చిత్రాన్ని విడుదల చేసిన తర్వాత నెట్టింట్లో మాత్రం మిశ్రమ స్పందనలు వచ్చాయి.

చాలా మంది ఇది దెయ్యం ముసుగులాగ కనబడిందని అభిప్రాయం పడితే, మరికొంతమంది ఇది దెయ్యం కాదు సింహం ముసుగు అని అంటున్నారు.మరికొందరు మరో అడుగు ముందుకేసి ఈ చిత్రాన్ని పిల్లల ప్రదర్శన టెలిటబ్బీస్‌తో పోల్చడం గమనార్హం.

కాగా ఈ ఫోటో అక్టోబర్ 26 నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మీరు చూడవచ్చు.ఇందులో వైరల్ కావడంతో, ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అలాగే పెద్ద ఎత్తున ఈ ఫోటోని లైక్స్ చేస్తున్నారు, షేర్స్ చేస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి అయితే ఇది సూర్య బిస్కెట్ అని సరదాగా కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.

సూర్యుడి ఈ చిత్రంతో పాటు, ఆ వ్యక్తి మినీ బిస్కెట్ ఫోటో కూడా షేర్‌ చేయడం కొసమెరుపు.అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం సూర్యుడి రూపం ఏదో ప్రమాదాన్ని సూచిస్తుందని అనుమానం వ్యక్తం చేసారు గానీ, పూర్తీ క్లారిటీ ఇంకా రావలసి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube