భారతీయ విద్యార్ధి చిత్రానికి 'నాసా క్యాలెండర్' లో ..గుర్తింపు

ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ రహస్యాలని బయటపెట్టే అధునాతన పరిజ్ఞానంతో కూడిన ప్రపంచ ప్రఖ్యాత నాసా, ప్రతీఏటా తన క్యాలెండర్ ని విడుదల చేస్తుంది.అయితే ఈ సారి నాసా తన క్యాలెండర్ -2019 లో తమిళనాడుకు చెందిన ఓ విద్యార్ధి గీసిన చిత్రానికి చోటు కల్పించింది.

 Nasa Selects Painting By 12 Year Old Student From Tamil Nadu-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.

ఆగస్టులో నాసా చిత్రలేఖన పోటీలు నిర్వహించింది…అనేక దేశాల నుంచీ సుమారు 4-12 ఏళ్ల వయసు గల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే భారత్ నుంచీ, దిండుక్కల్‌ జిల్లా పళని ప్రాంతం పుష్పత్తూరుకు చెందిన శ్రీవిద్యా మందిం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్ తేన్‌ముఖిల‌న్‌ ఎంతో వైవిధ్యంగా గీసిన “అంతరిక్షంలో ఆహారం” అనే చిత్రం అందరిని ఆకట్టుకుంది.

అందరిని మాత్రమే కాదు ఏకంగా నాసా ఆ చిత్రాన్ని ఒకే చేసింది.ఫలితంగా నాసా – 2019 క్యాలెండర్ లో చోటు కల్పించింది.గత సంవత్సరం కూడా ఈ పాఠశాల విద్యార్థులు గీసిన చిత్రం నాసా క్యాలెండర్‌లో చోటు సంపాదించడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube