భారతీయ విద్యార్ధి చిత్రానికి 'నాసా క్యాలెండర్' లో ..గుర్తింపు

ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ రహస్యాలని బయటపెట్టే అధునాతన పరిజ్ఞానంతో కూడిన ప్రపంచ ప్రఖ్యాత నాసా, ప్రతీఏటా తన క్యాలెండర్ ని విడుదల చేస్తుంది.

అయితే ఈ సారి నాసా తన క్యాలెండర్ -2019 లో తమిళనాడుకు చెందిన ఓ విద్యార్ధి గీసిన చిత్రానికి చోటు కల్పించింది.

వివరాలలోకి వెళ్తే.ఆగస్టులో నాసా చిత్రలేఖన పోటీలు నిర్వహించింది.

అనేక దేశాల నుంచీ సుమారు 4-12 ఏళ్ల వయసు గల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే భారత్ నుంచీ, దిండుక్కల్‌ జిల్లా పళని ప్రాంతం పుష్పత్తూరుకు చెందిన శ్రీవిద్యా మందిం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్ తేన్‌ముఖిల‌న్‌ ఎంతో వైవిధ్యంగా గీసిన “అంతరిక్షంలో ఆహారం” అనే చిత్రం అందరిని ఆకట్టుకుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అందరిని మాత్రమే కాదు ఏకంగా నాసా ఆ చిత్రాన్ని ఒకే చేసింది.

ఫలితంగా నాసా - 2019 క్యాలెండర్ లో చోటు కల్పించింది.గత సంవత్సరం కూడా ఈ పాఠశాల విద్యార్థులు గీసిన చిత్రం నాసా క్యాలెండర్‌లో చోటు సంపాదించడం విశేషం.

వైరల్ వీడియో: ఎందుకయ్యా ఇలా తయారయ్యారు.. బ్రతికున్న చేపలతో డ్రింక్..