కొత్తగా మా అధ్యక్షుడిగా ఎన్నికైనా రాజేంద్ర ప్రసాద్‌పై అప్పుడే విమర్శలు వస్తున్నాయి.ఈయన తీరుపై ప్రముఖ నటుడు సీనియర్ నరేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష హోదాలో చిరంజీవి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను కలిసిన విషయం తెల్సిందే.మా అధ్యక్షుడి హోదాలో ఒంటరిగా చిరంజీవిని మరియు కేసీఆర్‌ను కలవడాన్ని నరేష్ వ్యతిరేకిస్తున్నాడు.
ఈయన చేసిన పని కరెక్ట్ కాదని, భవిష్యత్తులో ఇలాంటి భేటీలు తప్పుడు సంకేతాలను మా సభ్యులోకి తీసుకు వెళ్తాయి అంటూ నరేష్ అన్నాడు.
మా రూల్స్ ప్రకారం అధ్యక్షుడు వ్యక్తిగతంగా మంత్రులను కాని, ముఖ్యమంత్రులను కాని కలిసిన సమయంలో సభ్యులతో చర్చించి వెళ్లాలని, లేని పక్షంలో సభ్యులందరితో కలిసి వెళ్లాలని నరేష్ గుర్తుకు తెచ్చాడు.
అయితే తాజాగా కేసీఆర్‌తో రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే భేటీ అయ్యాడు.ఈ పరిణామాలపై మా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీపై రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నరేష్ అన్నాడు.మరి రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంలో ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.