‘ప్రేమ కథాచిత్రమ్’ సినిమా తర్వాత సుధీర్‌బాబు మరో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.ఆ సినిమాలో తనతో జత కట్టిన నందితతో మరోసారి సుధీర్‌బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా చేశాడు.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టీజర్‌లు విడుదల అయ్యాయి.ఈ సినిమాలో రానా, నాగచైతన్యలు గెస్ట్‌రోల్స్‌లో నటిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే ఆడియో కూడా విడుదల అయ్యింది.ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేస్తామని అన్నారు.
అయితే ఇప్పటి వరకు ఆ సినిమా ఊసే ఎత్తడం లేదు.
ఆ సినిమా పరిస్థితి అలా ఉండగానే సుధీర్‌బాబు తాజా చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాడు.
తాజాగా ‘మోసగాళ్లకు మోసగాడు’ ఆడియో విడుదల తేదీని ఖరారు చేశారు.ఈనెల 26న ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించాడు.
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా విడుదల కాకుండానే ‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కృష్ణమ్మ పూర్తి అయిన తర్వాత ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు.
ఈ రెండు సినిమాలు కూడా సుధీర్‌బాబు కెరీర్‌లో మరిచి పోలేని సినిమాలుగా నిలిచి పోవడం ఖాయం అంటున్నారు.







