మళ్లీ పెళ్లి సినిమా విడుదల వాయిదా పడే అవకాశం లేనేలేదు

నరేష్( Naresh ) మరియు పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.గత కొన్ని రోజలుగా ఈ సినిమా యొక్క హడావుడి మామూలుగా లేదు.

 Naresh And Pavitra Lokesh Movie Malli Pelli Interesting Update , Naresh,  Pavitr-TeluguStop.com

ఈ సినిమా లో నరేష్ మరియు పవిత్ర లోకేష్‌ యొక్క ప్రేమ కథ ను మరియు రమ్య రఘుపతి గురించి చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.కనుక ఈ సినిమా లో తనను తప్పుగా చూపిస్తున్నారు.

కనుక సినిమా విడుదల ను అడ్డుకోవాలని కోర్టును నరేష్ ఇంకా తన నుండి విడాకులు తీసుకోలేదు అంటూ రమ్య రఘుపతి( Ramya Raghupathi ) వాదిస్తూ వస్తోంది.ప్రస్తుతం విడాకుల విషయం కోర్టు లో ఉన్న కారనంగా తాను ఏమీ మాట్లాడాలి అనుకోవడం లేదు అంటూ నరేష్ అంటున్నాడు.

ఆ విషయం పక్కన పెడితే మళ్లీ పెళ్లి సినిమాకు రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లడం వల్ల ఏమైనా సమస్య ఏర్పడుతుందా అంటే కచ్చింగా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Malli Pelli, Naresh, Pavitra Lokesh, Supreme, Telugu, Tollywood-Movie

ఎందుకంటే ఆ మధ్య ఒక కేసు విషయంలో సుప్రీం కోర్టు( Supreme Court ) సినిమా లను విడుదల ముందు అడ్డుకోవద్దని… స్టే విధించే విషయంలో ఒకటికి పది సార్లు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలంటూ సూచించాడు.దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి.

Telugu Malli Pelli, Naresh, Pavitra Lokesh, Supreme, Telugu, Tollywood-Movie

సినిమా విడుదల సమయంలో స్టే కోసం కోర్టును ఆశ్రయించే వారు చాలా మంది ఉన్నారు.కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు సూచించింది.కనుక నరేష్ మరియు పవిత్ర లోకేష్‌ ల యొక్క సినిమా మళ్లీ పెళ్లి విడుదల విషయంలో వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఉండే అవకాశం లేదు అంటూ న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఈ సమయంలో వాయిదా అసాధ్యంగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube