గురువాయూర్ లోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నిన్న రాత్రే మోడీ కోచి కి వెళ్లారు.

ఈరోజు ఉదయం కోచి నుంచి నేవి ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో త్రిశూర్ చేరుకుని,అనంతరం అక్కడ నుంచి గురువాయూర్ చేరుకున్నారు.అక్కడ ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న మోడీ అనంతరం ఆలయ ప్రాంగణంలో తులాభారం కార్యక్రమం జరిగింది.

తులాభారం త్రాచు లో ప్రధాని మోడీ కూర్చోగా దేవుడికి తులాభారాన్ని అందించారు.ఆలయ అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ దర్శనం ముగిసిన తరువాత మోడీ అక్కడ పార్టీ సభ్యులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని, అక్కడ నుంచి నేరుగా మాల్దీవులు,శ్రీలంక పర్యటనలకు వెళ్లనున్నారు.భారత ప్రధాని గా నరేంద్ర మోడీ రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తోలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.ఈ పర్యటన లో భాగంగా మాల్దీవుల పార్లమెంట్ లో మోడీ ప్రసంగించనున్నారు.

Advertisement

ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహిం సొహిల్‌తో భేటీ అయి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు తెలుస్తుంది.మాల్దీవుల పర్యటన నుంచి ఆయన శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు.

తప్పుడు ప్రచారం చేస్తున్న నాగబాబుకు ఈసీ షాక్.. మెట్టుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిందిగా!
Advertisement

తాజా వార్తలు