మోదీ 'లాక్ ' తీస్తారా ? అదే టెన్షన్ కొనసాగిస్తారా ?

కరోనా వైరస్ టెన్షన్ జనాల్లో రోజురోజుకు ఎక్కువవుతోంది.దీని ప్రభావం తగ్గుముఖం పట్టకపోగా, రోజురోజుకు మరింతగా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నట్టు గా కనిపిస్తోంది.ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం శ్రుతి మించడం, వేలకొద్ది ప్రతిరోజు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, మరణాల శాతం ఎక్కువ అవుతుండగా, భారత్ లో పరిస్థితి అదుపులోకి రావడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం కారణం.

అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ మోడీ సంచలన నిర్ణయం తీసుకోవడం తో పరిస్థితి అదుపులో ఉంది.మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు.

ఇక ప్రపంచ దేశాలు ఈ వైరస్ ప్రభావం తో ఇబ్బంది పడుతున్న దేశాలు మోదీ నిర్ణయాన్ని సమర్థించాయి.అమెరికాలో లాక్ డౌన్ విదించక పోవడం వల్లే అక్కడ అ వైరస్ వ్యాప్తి కట్టడి చేయలేని విధంగా విజృంభిస్తోంది.

Advertisement

మరణాల శాతం పెరుగుతుందనే లెక్కలు వస్తున్నాయి.మార్చి 25 వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లోకి రావడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు.

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.దీంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వివిధ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు వెళ్ళిన వారు ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు.దీంతో లాక్ డౌన్ నిబంధనలు ఏప్రిల్ 14వ తేదీ ఎత్తి వేస్తారా లేక మరికొంత కాలం పొడిగిస్తారా అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో మరికొంత కాలం పొడిగించాలనే సూచనలు ప్రధాని నరేంద్ర మోడీకి అందుతున్నాయి.దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది టెన్షన్ గా మారింది.130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయకపోతే అరకొర వైద్య సదుపాయాలు ఉన్న భారతదేశంలో పరిస్థితి అదుపులోకి రాదు.అయితే మరి కొంతకాలం లాక్ డౌన్ ను పొడిగిస్తే ప్రజలు, ప్రభుత్వాలు, ఆర్థికంగా కోలుకోలేని స్థాయిలో చితికిపోతాయి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని మోడీ లాక్ డౌన్ విషయంలో మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ ల అభిప్రాయం ప్రధానమంత్రి కార్యాలయం తీసుకుంది.

Advertisement

అలాగే ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు