భారతీయులు తప్పు చేశారట…! అంత పెద్ద పొరపాటు వారు ఏం చేశారు? దేశ ప్రజలంతా కలిసి తప్పు చేశారంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే అయివుంటుంది.అవుననే అంటున్నారు యూపీఏలో మంత్రిగా పని చేసిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్.
దేశ ప్రజలు నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకొని పెద్ద తప్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.అర్హత లేని వ్యక్తిని, తప్పుడు వ్యక్తిని (రాంగ్ పర్సన్) అందలం ఎక్కించారని విమర్శించారు.
వ్యవసాయదారులు, చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతుండగా, వారిని పట్టించుకోని మోదీ అమెరికా అధ్యక్షుడిని రిప్లబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా తీసుకురావడాన్ని ఘన విజయంగా భావిస్తున్నారని అన్నారు.ఆయన ఆలోచనా రహితంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆలోచన లేకుండా మాట్లాడటం ఆయనకు అలవాటు అని కూడా ఉన్నారు.మోదీ ప్రవాస భారతీయులను ఇష్టపడతారని, కాని వారిలో ఎక్కువమంది భారత్‌లో ఉన్నవారిని పట్టించుకోరని అన్నారు.
మోదీ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా భారత్ మారిపోయిందని చెబుతున్నారని, కాని ప్రజలు మారారని చెప్పడంలేదన్నారు.మన్మోహన్ సింగ్ అసమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకోగా, మోదీ ఆలోచన లేని ప్రధానిగా విమర్శల పాలవుతున్నారు.