వైసీపీకి రాజీనామా చేస్తున్నా..: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు

వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు( MP Lavu Sri Krishna Devarayalu ) అన్నారు.

రాజకీయ అనిశ్చితి నెలకొందన్న ఆయన తన రాజీనామాకు అదే ముఖ్య కారణమని తెలిపారు.

అయితే ఎంపీగా నరసరావుపేట ప్రజలు ఆశీర్వదించారని శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు.సంక్షేమం అంటే ఎలా ఉండాలనేది సీఎం జగన్ చూపించారని పేర్కొన్నారు.

తానెప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ( YCP ) సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.ఈ ఐదేళ్లలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు