ఈ సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం అలాగే థియేటర్ల వద్ద అసలైన పండగ వాతావరణం తీసుకురావడం కోసం మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య బాబు సిద్ధమైన విషయం తెలిసిందే.కేవలం ఒక్కరోజు తేడాదో ఈ ఇద్దరు బడా హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.
బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12న అనగా ఈరోజు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా, మెగాస్టార్ నటించిన వాళ్తేరు వీరయ్య సినిమా ఒక్కరోజు ఆలస్యంగా అనగా జనవరి 13న విడుదల కానుంది.అందుకు అనుగుణంగా ఏపీలో తెలంగాణలో టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఏంటి సినిమాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక స్పందించారు.ఈ సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ చేస్తూ.ప్రేక్షకులకు వినోదం పంచడానికి సిద్ధమైన బాలయ్య మామయ్యకి అలాగే చిరంజీవి గారికి శుభాకాంక్షలు.అలరించే పాటలు ఆలోచింపజేసే మాటలు డాన్స్ లు పూర్తిస్థాయి వినోదం అందించే ఈ రెండు చిత్రాలను కోట్లాదిపేక్షకులలో ఒకడిగా నేను చూడాలని కోరుకుంటున్నాను.హీరోల పేరుతో కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేగాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమయింది.
ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భాన్ని వాడుకొని సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మరో కులం పై విషం చిమ్మాలని కుట్రలు పన్నారు అంటూ ఆరోపించారు.

అంతేకాకుండా దుష్ప్రచారాలు చేసి కులమత ప్రాంతాల మధ్య వివాదాలు రగిలించి దుష్ట చరిత్ర కలిగిన వారి ట్రాప్ లో ఎవరూ పడొద్దు అని లోకేష్ సూచించారు.కాగా లోకేష్ ట్వీట్ పై పలువురు స్పందిస్తూ ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం చిన్నగానే చిచ్చు పెట్టేసాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చిన్నగా గొడవ పెట్టేసాడు గా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ట్వీట్ పై కేవలం బాలయ్య బాబు మెగాస్టార్ అభిమానులు మాత్రమే కాకుండా టిడిపి అలాగే వైసిపి నాయకుల సైతం స్పందిస్తున్నారు.







