ఏపీ సీఎం జగన్ పై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సీఎం జగన్ ఉన్నత విద్యావంతుడు కాదన్న నాగబాబు ఎవరూ చెప్పినా వినరన్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిఘా పెడుతున్నారని విమర్శించారు.పోలీసులు, సీఐడీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని చెప్పారు.పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకునేందుకే జీవో నెంబర్ -1 ను ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు.







