తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి నటి సింహం బాలకృష్ణకు కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే విదేశాలలో కూడా బాలయ్య సినిమాలకు ఎంతో మంచి క్రేజ్ ఉంటుంది.
ఇకపోతే తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో బాలయ్య అభిమానులు చేస్తున్న హంగామా మామూలుగా లేదు అయితే ఇక్కడ మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని చెప్పాలి.

ఇకపోతే అమెరికాలో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా చూస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పేపర్లు చింపుతూ గాల్లోకి విసిరి ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఇది చూసినటువంటి థియేటర్ యాజమాన్యం సినిమాని మధ్యలోనే నిలిపివేశారు.ఇలా షో మధ్యలోనే ఆపేయడమే కాకుండా ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.
అయితే ఎప్పుడు కూడా ఇలా చేయలేదని యాజమాన్యం బాలయ్య అభిమానులపై మండిపడ్డారు.

ఈ విధంగా థియేటర్లో అభిమానులు చేస్తున్న రచ్చను చూసినటువంటి యాజమాన్యం మధ్యలోనే షో నిలిపివేసి అందరిని బయటకు పంపించేశారు.అదేవిధంగా మరో థియేటర్లో జై బాలయ్య అంటూ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అలా అరవద్దని ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం సూచించారు.ఏది ఏమైనా ఈ సినిమాకి వస్తున్న ఆదరణ మాత్రం భారీగానే ఉందని చెప్పాలి.







