ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు.దీనిలో భాగంగా ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారు.
ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో ఉన్నారు.ఇటీవల ప్రొద్దుటూరులో ఘర్షణలలో దెబ్బతిన్న మూర్తి కుటుంబాన్ని కూడా లోకేష్ పరామర్శించనున్నారు.
మరోవైపు లోకేష్ పర్యటనలో పాల్గొనకుండా స్థానిక పార్టీ నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు అందించారు.ఈ క్రమంలో ఆయన పర్యటనను అడుగడుగునా అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.