తమిళనాడులో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కావేరి ఉధృతికి పలు గ్రామాలు నీట మునిగాయి.
జనజీవనం అస్తవ్యస్థమైంది.వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
దీంతో అప్రమత్తమైన అధికారులు కావేరి నది పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.మేటూరు డ్యామ్ నుంచి రెండు లక్షల క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేశారు.
వరద నీటి ప్రవాహం భారీగా కొనసాగుతుండటంతో ఈ-రోడ్ సంగమేశ్వర టెంపుల్ పూర్తిగా నీట మునిగింది.ఈ-రోడ్ జిల్లా భవానీ పరిసర ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.