టీడీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ రైతులకు మంచి రోజులు - నారా లోకేష్

శ్రీకాళహస్తి నియోజకవర్గం, కుక్కలవారి కండ్రికలో వరి కయ్యల్లోకి దిగి రైతులతో మాట్లాడిన నారా లోకేష్.రైతుల ఆవేద‌న.

 Nara Lokesh Interact With Farmers In Srikalahasthi Constituency Details, Nara Lo-TeluguStop.com

వడ్లు కొనడం లేదు.కొన్నా డబ్బులిస్తారని నమ్మకం లేదు.

రైతు భరోసా కేంద్రాల్లో నచ్చిన వారికి ఫోన్లు చేసి విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు.చంద్రబాబు ఉన్నప్పుడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మలేదు.

ఈ క్రాప్ నమోదు చేయడం లేదు.పరిహారం అందించడం లేదు.

వరి కోతకు కూలీలు రాకపోవడం వల్ల మిషన్లతో కోయిస్తున్నాం.

నారా లోకేష్ మాట్లాడుతూ.రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు.కానీ ఆ నిధులు కేటాయించలేదు.రైతులను ఆదుకోలేదు.గతంలో ఉన్నట్లుగా ఎరువుల ధరలు ఇప్పుడు లేవు, పెరిగిపోయాయి.రైతులకు పెట్టుబడి పెరిగింది.

గిట్టుబాటు ధర రావడం లేదు.టీడీపీ ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేసి ఏ పంట వేసుకోవాలో రైతులకు సూచించాం.

కానీ ఇప్పుడు భూసార పరీక్షలు లేవు.టీడీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ రైతులకు మంచి రోజులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube