వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని యాక్టివ్ గా ఉండే పొలిటికల్ నేతల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి( MLA Kethireddy ) ఒకరు.గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ద్వారా తన నియోజకవర్గంలోని ప్రజల అవసరాలు తెలుసుకోవడం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులతో సహా పొద్దున్నే పాదయాత్ర చేయడం అందర్నీ పలకరిస్తూ వెళ్లడం, సమస్యలు ఏమైనా చెప్తే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేయడం ఇలా తక్కువ కాలంలోనే పాపులర్ అయిన నేతగా ఈయన పేరు తెచ్చుకున్నారు.ముఖ్యమంత్రి జగన్ కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డిలా పని చేయాలంటూ మిగిలిన ఎమ్మెల్యేలకు ఈయనను ఆదర్శంగా చూపించిన సందర్భాలు ఉన్నాయి అయితే పైకి మాత్రమే హడావిడి చేస్తూ నీతులు చెబుతున్నారు కానీ వీళ్లే పెద్ద స్థాయిలో అవినీతి చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ( lokesh )విమర్శిస్తున్నారు

యువగళం పాదయాత్రలో భాగంగాసత్య సాయి జిల్లాలోని ధర్మవరంలో పర్యటిస్తున్న లోకేష్ స్థానిక ఎమ్మెల్యే కేతి రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.ప్రజలకు అధికారులకు తెల్లారి లెస్తే నీతులు ధర్మ సూత్రాలు బోధించే ఎమ్మెల్యే దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని తన విలాసాల కోసం ఎస్టేట్లు కట్టుకున్నారని .ఇది మరో రుషికొండ లాంటి స్కాం అని విమర్శించారు.సర్వేనెంబర్ 902, 909 లోని దాదాపు 20 ఎకరాలు ప్రబుత్వ భూమిని తన హస్తగతం చేసుకున్న ఎమ్మెల్యే తన విలాసాలకు అడ్డగా మార్చుకున్నాడని ఆయన చెప్పుకొచ్చారు….
దీనికి సాక్ష్యంగా డ్రోన్ కెమెరాతో తీసిన విజువల్స్ ను కూడా మీడియాకు సూచించారు.

వైసీపీ పార్టీ మరొక సారి అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా ప్రభుత్వ అధీనంలో లేకుండా కబ్జా చేసేస్తారని, ఆ పార్టీని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.అభివృద్ధి అంటే అర్థం తెలియని పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని మరొకసారి ఆ తప్పు జరగకూడదని, చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకుడు ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మరి సాక్షాలతో సహా తమ అవినీతిపై విమర్శలు చేస్తున్న లోకేష్ పై ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిస్పందన ఏమిటొ అన్నది చూడాలి.అంతేకాకుండా రోజురోజుకు పరిణితి చెందుతూ , ప్రతి పక్షాలను చీల్చి చెండాడుతున్న తమ యువ నాయకుడ్ని చూసి తెలుగు దేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ….







