సీఎం జగన్ పై నారా లోకేశ్ విమర్శలు

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.ఇందులో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 Nara Lokesh Criticizes Cm Jagan-TeluguStop.com

అనంతరం సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో రైతులను సీఎం జగన్ నట్టేట ముంచారని లోకేశ్ ఆరోపించారు.

ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదని విమర్శించారు.పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని చెప్పారు.రాష్ట్రంలోని ప్రతి రైతుపై రూ.2.5 లక్షల అప్పు ఉందని విమర్శించారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube