సీఎం జగన్ పై నారా లోకేశ్ విమర్శలు

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.

ఇందులో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో రైతులను సీఎం జగన్ నట్టేట ముంచారని లోకేశ్ ఆరోపించారు.

ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదని విమర్శించారు.

పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని చెప్పారు.రాష్ట్రంలోని ప్రతి రైతుపై రూ.

2.5 లక్షల అప్పు ఉందని విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

మంత్రి పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు