Nara Lokesh, Brahmini : లోకేష్ బ్రాహ్మణి ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి.. అప్పుడు ఎలా ఉందో చూశారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) పెద్ద కుమార్తె బ్రాహ్మిని( Brahmani ) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ( Lokesh ) కి ఇచ్చి వివాహం చేసిన విషయం మనకు తెలిసిందే.నారా భువనేశ్వరి స్వయంగా బాలకృష్ణ అక్క కావడంతో తన అక్క కొడుకుకి తన కూతురిని ఇచ్చి వివాహం చేశారు.

 Nara Lokesh Brahmini Engagement Photos Viral On Social Media-TeluguStop.com

అప్పట్లో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి పాత ఫోటోలు వీడియోలు తిరిగి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నారా లోకేష్ బ్రాహ్మిని వివాహపు ఫోటోలు నిశ్చితార్థపు ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ నిశ్చితార్థపు ఫోటోలలో ఎన్టీఆర్( NTR ) భార్య లక్ష్మీ ప్రణతి ( Lakshmi Pranathi ) కూడా ఉండటం విశేషం.

ఇలా లక్ష్మీ ప్రణతి ఈ ఫోటోలలో ఉండడంతో అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.ఈ ఫోటోలలో లక్ష్మీ ప్రణతిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

అయితే లక్ష్మీ ప్రణతి స్వయంగా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu)సమీప బంధువు కావడంతో ఈమె ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.అయితే ఈ పెళ్లి వేడుకలలో ఎన్టీఆర్ కూడా పాల్గొనడం గమనార్హం.

Telugu Balakrishna, Brahmini, Lokesh-Movie

ఇలా లక్ష్మీ ప్రణతి ఈ నిశ్చితార్థపు వేడుకలో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.ఇప్పుడు ఎలా అయితే అందంగా ఉన్నారో అప్పటికి కూడా ఈమె అదే అందంతో అందరిని ఆకట్టుకునేలాగే ఉన్నారు.సాంప్రదాయంగా లంగా వోని ధరించి చేతినిండా గాజులు, నగలు ధరించి సాక్షాత్తు మహాలక్ష్మి లాగే ఉన్నారు.ఇప్పుడు కూడా లక్ష్మీ ప్రణతి ఎంతో పద్ధతిగా ఉంటారని విషయం మనకు తెలిసిందే.

అయితే చిన్నప్పటినుంచి ఈమెకు ఇలా ఉండటమే ఇష్టమని తాజాగా ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.

Telugu Balakrishna, Brahmini, Lokesh-Movie

ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ ఫోటో చూసి సంతోషపడటమే కాకుండా ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు వదినమ్మ అప్పటికే ఎంతో అందంగా చూడముచ్చటగా ఉండేదని కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక చంద్రబాబు నాయుడుకు లక్ష్మీ ప్రణతి కుటుంబ సభ్యులు సమీప బంధువులు కావడంతో చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్టీఆర్ కి ఈ పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగిన తర్వాత వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

అయితే పెళ్లి జరిగి ఒక స్టార్ హీరోకి భార్య అయినటువంటి లక్ష్మీ ప్రణతి ఎప్పుడు కూడా ఎక్కడ బయటకు రారు, అలాగే సోషల్ మీడియాలో అస్సలు అడుగుపెట్టలేదు.కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఒక సాధారణ గృహిణిగా ఉన్నారు.

ఇక ఈ దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు సంతానం ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube