నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
నాని మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు కనిపిస్తుంది.ఇక పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని వరుసగా హత్యలు చేస్తూ కనిపిస్తున్నాడు.
అటు నానిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు.నాని ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, దాని వెనకాల ఉన్న కారణం ఏమిటనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
మొత్తానికి మరోసారి నాని తాను నేచురల్ స్టార్ అని ఎందుకు అనిపించుకుంటున్నాడో ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తే కనిపిస్తుందని ‘వి’ చిత్ర ట్రైలర్‌లో చూపించేశారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితిరావు హైదరీ నటిస్తున్నారు.
కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy