నాని( Nani ) గత కొన్ని రోజులుగా మాస్ సినిమాలపై తన ఫోకస్ పెంచుతూ వస్తున్నాడు.ఇప్పటి వరకు పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని దసరా సినిమాతో ఎవరు ఊహించని విధంగా మాస్ ప్రేక్షకులను ఫిదా చేశాడు.
ఇక హాయ్ నాన్న మళ్ళీ ఒక క్లాస్ చిత్రం అయినప్పటికీ తన తదుపరి సినిమాలన్నీ కూడా మాస్ ఎలిమెంట్స్ తోనే ఉండబోతున్నాయి అని అతడు సైన్ చేస్తున్న సినిమాలను బట్టి చూస్తే అర్థమవుతుంది.ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోగా కలెక్షన్స్ సాధిస్తూ వస్తున్న నాని హాయ్ నాన్న సినిమా( Hi Nanna )తో ఏకంగా 175 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి 100 కోట్లకు పైగా సాధించిన హీరోల సరసన చేరాడు.
మరి ఇప్పుడు నాని తీసుకుంటున్న సినిమాల డెసిషన్స్ ఎలా ఉంటున్నాయి ? అతను చేస్తున్న సినిమాలు ఏంటి? మరో రెండేళ్ల పాటు అతడి షెడ్యూల్ ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నాని హాయ్ నాన్న సినిమా తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్నాడు.2023 అతడికి బాగా కలిసి వచ్చింది.దసరా, హాయ్ నాన్న రెండు వరస బ్లాక్ బాస్టర్ విజయాలను అతడు ఖాతాలో వేసుకున్నాడు.2024 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.ఈ ఏడాది కూడా వరుస సినిమాలు విడుదల చేసి సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాడు.
ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ సినిమాలో నటిస్తున్నాడు.దీనికి సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram) అనే టైటిల్ ఖరారు చేయగా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే వీరి కాంబినేషన్లో చివరగా అంటే సుందరానికి సినిమా వచ్చింది.ఈ సినిమా పరాజయం పాలైన వివేక్ ఆత్రేయ పై నాని నమ్మకం గట్టిగానే ఉంది.
సరిపోదా శనివారం సినిమా సైతం మంచి యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రం పూర్తి కాగానే సాహో ఫ్రేమ్ సుజిత్ ( Sujeeth )తో ఒక యాక్షన్ చిత్రాన్ని చేయడానికి కమిట్ అయ్యాడట నాని.ప్రస్తుతం సుజిత్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బిజీగా ఉన్నాడు.అది అయిపోగానే నాని చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట.
ఇది అయిపోగానే బలగంతో తొలిసారి హిట్ అందుకున్న వేణుతో మరో సినిమాని ఓకే చేశాడు నాని.ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే ఒక పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇది కూడా మంచి యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుంది.దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల చెప్పినా లైన్ కూడా నచ్చడంతో అది తీయాలని అనుకుంటున్నారట.
ఇది కూడా ఒక యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది.ఇలా అన్ని యాక్షన్ చిత్రాలనే ఒప్పుకుంటూ మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకునే పనిలో ఉన్నాడు నాని.