తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ కూడా రష్మిక మందన్న తదుపరి సినిమా కూడా తెలుగులో ఉంటుందని అనుకుంటున్నారు.ప్రస్తుతం తెలుగులో పుష్ప సీక్వెల్ లో నటిస్తున్న రష్మిక ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఓకే చెప్పడానికి సిద్ధంగా లేదు అనే వార్తలు అందరిని షాప్ కి గురి చేస్తున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం అందరి చూపు రష్మిక మందన్న( Rashmika Mandanna ) వైపే ఉంది.స్టార్ హీరోలు అంతా కూడా ఈ నేషనల్ బ్యూటీని తమ పక్కన నటింపజేయాలని అనుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు అవకాశాలు లేక ఇబ్బంది పడి మెల్లిమెల్లిగా తెలుగు నుంచి హిందీకి వెళ్లి అక్కడ పరవాలేదు అనిపించుకుంటున్న రష్మిక ఆ తర్వాత అన్ని భాషలను సరిగ్గా మేనేజ్ చేస్తుంది అనుకుంటే ఆమె చూపు కేవలం బాంబే పైనే ఉంది అని తెలుస్తోంది.ఇక తెలుగు సినిమాలకు టాటా గుడ్ బై చెప్పేసినట్టే అని కూడా అనుకుంటున్నారు.
ఇంతకీ రష్మికపై ఈ అభిప్రాయం రావడానికి కారణం ఏంటి ? ఆమె నటిస్తున్న తదుపరి సినిమాలు ఏంటి ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పుష్ప సినిమా కన్నా కూడా ఆనిమల్ సినిమా ( Animal movie )తర్వాతే రష్మిక ఆలోచనలో మార్పులు కనిపిస్తున్నాయి.అంతకు ముందు వరకు ఆమె కెరియర్ అంతంత మాత్రం గానే ఉండేది.కానీ అనిమల్ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
దాంతో అనిమల్ సినిమా తర్వాత ఇప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తున్న రష్మిక ఏ ఒక్కటి రీజనల్ సినిమా లేకపోవడం విశేషం ఆమె నటిస్తున్న నాలుగు సినిమాలు దాదాపు ఫ్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ మాత్రమే.అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో( lady oriented movies ) కూడా నటిస్తుంది.
అంతేగాని కేవలం తెలుగులోనే అని ఒప్పుకున్న సినిమా ఏదీ లేదు.

రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ ( Rainbow, The Girlfriend )రెండు సినిమాలు కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కావడం విశేషం.పుష్ప 2 తో పాటు చావా అనే హిందీ సినిమాలో ఆమె నటిస్తున్నారు.అయితే ప్రస్తుతం అనిమల్ క్రేజ్ తర్వాత బాలీవుడ్ నిర్మాతలు రష్మిక ఇంటి ముందు క్యూ కడుతున్నారు.
దొరికిందే చాన్స్ అని అనుకుందో ఏమో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది.అయినా కూడా ఎవరు తగ్గేదేలే అంటూ రష్మిక కోసం పోటీ పడుతున్నారు.
ఇక నాగార్జున ధనుష్ మల్టీస్టారర్ గా వస్తున్న శేఖర్ కమ్ములకు కుబేర్ చిత్రంలో కూడా హీరోయిన్ గా రష్మిక ఓకే చేసిందట.ఇలా ఫ్యాన్ ఇండియా సినిమా లేదంటే హిందీ సినిమా అని గిరి గిసుకొని సినిమాలను ఓకే చేస్తుందట.
ఇక దాదాపు తెలుగు సినిమాల్లో ఆమె నేరుగా నటించే అవకాశాలు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నారు.