నాచురల్ స్టార్ నాని ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో నాని శ్యామ్ సింగ రాయ్, వాసు అనే రెండు పాత్రల్లో నటిస్తున్నాడు.డిసెంబర్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సినిమాకు సెన్సార్ టీం U/A సర్టిఫికెట్ ఇచ్చారు.
అంతేకాదు సెన్సార్ టీం నుండి సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినట్టు తెలుస్తుంది.
తన మొదటి సినిమా ట్యాక్సీవాలాతోనే ప్రయోగం చేసిన రాహుల్ సంకృత్యన్ తన సెకండ్ సినిమా నానితో మరో ప్రయోగాత్మక సినిమా చేశాడని తెలుస్తుంది.శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది 24న తెలుస్తుంది.నాని నుండి రాబోతున్న డిఫరెంట్ మూవీగా శ్యామ్ సింగ రాయ్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
అయితే నానితో పాటు ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టిలు కూడా నటించడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది.