భార్య నుదటిన తిలకం పెట్టి శుభవార్త చెప్పిన నాని... పోస్ట్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టినటువంటి హీరోలలో నాచురల్ స్టార్ నాని (Nani)కూడా ఒకరు.

సినిమాలపై ఆసక్తితో నాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

కెరియర్ మొదట్లో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి నాని అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు.

అష్టా చమ్మ( Astha Chamma ) సినిమా ద్వారా మొదటిసారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇలా అష్టా చమ్మ సినిమా మంచి హిట్ కావడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇలా ప్రతి సినిమాకు తనలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెడుతూ ఈయన కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా( Hero Nani ) గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక నాని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

Advertisement

ఇక నాని సినీ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక వ్యక్తిగత జీవితంలో కూడా నాని చాలా సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈయన అంజనా ( Anjanaa ) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు అర్జున్ (Arjun) అనే కుమారుడు కూడా ఉన్నారు.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నాని గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నాని అంజన మధ్య గొడవలు వచ్చాయని విడాకులు( Divorce ) తీసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై నాని ఎప్పుడు కూడా స్పందించలేదు.

కానీ తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో చూస్తే మాత్రం విడాకుల వార్తలన్నీ కూడా ఫేక్ అని సమాధానం చెప్పకనే చెప్పేశారు.నాని తన భార్య అంజనా నుదుటిపై కుంకుమ పెడుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.అయితే వీరి పెళ్లి జరిగి 11 సంవత్సరాలు కావడంతో వీరి వెడ్డింగ్ యానివర్సరీ(Wedding Anniversary) సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేస్తూ వారి మధ్య ఉన్న అన్యోన్యతను బయటపెట్టారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఇక వీరి పెళ్లి రోజు కావడంతో ప్రతి ఒక్కరు వీరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు