నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా మొదలుకుని వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) ఎఫ్ 3 సినిమా మినహా మిగిలిన అన్ని సినిమా లు కూడా కమర్షియల్ గా మంచి విజయాలను అందుకున్నాయి.తాజాగా వచ్చిన బాలకృష్ణ( Balakrishna ) భగవంత్ కేసరి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో దర్శకుడు అనిల్ రావిపూడికి మంచి డిమాండ్ ఉంది.
ముందు ముందు ఆయన నుంచి పెద్ద సినిమా లు వస్తాయని అంతా భావిస్తున్నారు.భగవంత్ కేసరి సినిమా యొక్క ప్రమోషన్ లో బిజీగా ఉన్న అతడు తదుపరి సినిమా విషయం లో ప్రస్తుతం చర్చలు జరపడం లేదు.
కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) సమయం లో అనిల్ వర్క్ నచ్చిన బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ యొక్క ఎంట్రీ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.ఇప్పటికే మంచి కథ ను రెడీ చేసి తీసుకురా. మోక్షజ్ఞ( Mokshagna ) ను హీరోగా పరిచయం చేద్దాం అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి తో బాలకృష్ణ చెప్పాడు అంటూ సమాచారం అందుతోంది.ఈ విషయం లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంది.
ప్రస్తుతానికి శ్రీ లీల తో కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు రాష్ట్రా ల్లో భగవంత్ కేసరి సినిమా ప్రచారం లో పాల్గొంటున్నాడు.
కామెడీ సినిమా( Comedy Movies ) లకు కేరాఫ్ అడ్రస్ అంటూ పేరు దక్కించుకున్న అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా లో ఒక సీరియస్ పాయింట్ ను తీసుకుని, చాలా చక్కగా చూపించాడు అంటూ చాలా మంది ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.కనుక ముందు ముందు స్టార్స్ తో, క్రేజీ హీరోలతో సినిమాలను ఈయన చేసే అవకాశాలు ఉన్నాయి.వచ్చే ఏడాది ఆరంభం లో సినిమా ను ప్రారంభించి 2024 లోనే సినిమా వచ్చే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి.