నేచురల్ స్టార్ నాని ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే , మరోపక్క వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు.తాజాగా మీట్ క్యూట్ అనే చిత్రాన్ని నిర్మించాడు.
ఈ ప్రాజెక్ట్ గురించి గతంలోనే నాని ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు.ఈ చిత్రంతో నాని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఇదివరకు ఈమె అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించింది.ఈ షార్ట్ ఫిలిం గొప్ప ప్రశంసలు దక్కించుకుంది.
ఇక ఇప్పుడు మీట్క్యూట్తో ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టింది.
ఆంథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నట్లు నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
అంతేకాకుండా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రివీల్ చేశాడు.ఈ మూవీలో ఆరుగురు హీరోయిన్లు నటించారు.
రుహాని శర్మ, ఆకాంక్షసింగ్, ఆదా శర్మ, వర్షబొల్లమ్మ, సునైనా, సంచిత వంటి ఆరుగురు ఈ చిత్రంలో కథానాయిక పాత్రలు పోషించారు.సత్యరాజ్, రోహిణి కీలకపాత్రలు పోషించారు.