బుల్లితెర ఫై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న షో బిగ్ బాస్.నార్త్ లో సూపర్ సక్సెస్ సాధించిన ఈ షో.సౌత్ లోను అంతే సక్సెస్ ఫుల్ గా అత్యధిక TRP రేటింగ్ తో కొనసాగుతుంది.ప్రస్తుతం తెలుగు లో ఆరోవ సీజన్ నడుస్తుంది.
ఈ సీజన్ లో శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్, వాసంతి, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమాలు హౌస్ లో అడుగుపెట్టగా.వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూలు ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు.
ఈ వారం ఎవరు హౌస్ ను విడిచి వెళ్లనున్నారనేది ఆసక్తి గా మారింది.ఈ వారంలో బాలాదిత్య, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, ఇనాయా సుల్తానాలు నామినేట్ అయ్యారు.
కాగా ఈ వారం ఓటింగ్ శాతం చూస్తే.ఇనాయా సుల్తానా టాప్ ప్లేస్‌లో ఉండగా.
రేవంత్ రెండో స్థానంలో శ్రీహాన్ మూడో స్థానంలో, ఆది రెడ్డి నాలుగో స్థానంలో, కీర్తి భట్ ఐదో స్థానంలో, జబర్ధస్త్ ఫైమా ఆరో స్థానంలో ఏడో స్థానంలో బాలాదిత్య , ఎనిమిదో స్థానంలో మెరీనా, తొమ్మిదో స్థానంలో వాసంతి కృష్ణన్ ఉన్నారు.అయితే వీరిలో ఓటింగ్ శాతం తక్కువ తేడానే ఉండడం తో.ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కీర్తి.వాసంతి.
వీళ్లిదరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేషన్ అవొచ్చని అంటున్నారు.మరి ఎవరు హౌస్ ను విడిచి వెళ్తారో చూడాలి.







