Dasara Movie: దసరా సినిమా హిట్టు.. కానీ ఈ మైనస్ పాయింట్స్ సంగతి ఏంటి ?

నాని దసరా సినిమా( Dasara Movie ) ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.వ్యాపారం కూడా బాగానే జరిగింది కాబట్టి కలెక్షన్స్ కి కూడా డోకా లేదు.

 Dasara Movie: దసరా సినిమా హిట్టు.. కానీ-TeluguStop.com

ఇప్పుడు మార్కెట్లో సరైన సినిమా లేదు కాబట్టి అన్ని థియేటర్స్ లో ఈ చిత్రమే ఉంటుంది.ఇప్పటికే యూట్యూబ్లో బోలెడన్ని రివ్యూలు అడ్డగోలుగా వచ్చేస్తున్నాయి.

అయితే ఈ సినిమా విషయంలో కలెక్షన్స్ సునామీ కురిపించడం ఖాయమైనప్పటికీ కొన్ని మైనస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి.అవేంటో ప్రతి ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దర్శకుడి అనుభవ లేమి

దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు( Director Srikanth Odela ) మొట్టమొదటి సినిమా కావడంతో అక్కడక్కడ అతడు తడబడ్డట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది.నాని ( Nani ) లాంటి స్టార్ హీరోను పెట్టుకొని సినిమాను బాగానే రక్త కట్టించే ప్రయత్నం అయితే చేశాడు.

Telugu Dasara, Dasara Result, Srikanth Odela, Nani, Keerthy Suresh, Nani Dasara,

కామెడీ

దసరా సినిమాలో ఖచ్చితంగా కామెడీలో లోపించింది.ఈ సినిమాలో సిల్క్ బారు ప్రయోగం ఎవరిని ఆసక్తి పరిచే విధంగా లేదు.కామెడీ లేకపోవడం దసరా సినిమాకి పెద్ద మైనస్ పాయింట్.

Telugu Dasara, Dasara Result, Srikanth Odela, Nani, Keerthy Suresh, Nani Dasara,

నాని యాస

పక్తు ఆంధ్ర నటుడు అయినా నాని తెలంగాణ భాషలో, యాసలో మాట్లాడడానికి బాగానే సాధన చేశాడు కానీ అది అతడి వల్ల కాలేదు.అందుకే అక్కడక్కడ భాషలో లోపాలు కనిపించాయి.నిజానికి నాని చిన్న సినిమాలు చేసినప్పుడే అద్భుతంగా కనిపించాడు.

ఎప్పుడైతే సినిమాలు కమర్షియల్ గా చేయడం మొదలు పెట్టారో స్టార్ హీరో లాగా ఆలోచించడం మొదలు పెట్టాడు.అందుకే కాస్త గతి తప్పుతున్నాడు.మిగతా హీరోల మాదిరిగానే నాని కూడా మారిపోయాడు.

Telugu Dasara, Dasara Result, Srikanth Odela, Nani, Keerthy Suresh, Nani Dasara,

కథ

ఈ సినిమా ఇప్పుడున్న ట్రెండుకు తగ్గట్టుగా తెలంగాణ కథను, యాసను ఆధారం చేసుకుని తీసినప్పటికీ పాత చింతకాయ పచ్చడి కాబట్టి అంతగా రుచిగా అనిపించలేదు.ఈ రివెంజ్ డ్రామా టైపు స్టొరీలు ఇప్పటికే నాని బోలెడు చేశాడు.ఈ జోనర్ చిత్రాలే తప్ప ఈ సినిమాలో కథ అయితే ఏమీ లేదు.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది సంగీతం మరియు కీర్తి సురేష్. తనది కానీ భాషలో ఆమె అద్భుతంగా నటించింది.

సంగీతం కూడా సంతోష్ నారాయన్ చక్కగా అందించాడు, బిజిఎం అదిరిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube