ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.ఇలా ఒక సినిమా విడుదలయ్యి ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న లేదా ఆ చిత్ర దర్శకుడు పుట్టినరోజు సందర్భంగా లేకపోతే హీరోల పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనవాయితీగా మారింది.
ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎంతో అద్భుతమైన కలెక్షన్లను సాధించింది.ఇలా ఇప్పటికే ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తారక్ బాలయ్య నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు 4k వర్షన్ లో విడుదలయ్యాయి.

ఈ విధంగా ఈ హీరోల సినిమాలు రీ రిలీజ్ లో కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లను సాధించి తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు.ఈ క్రమంలోనే మరొక సినిమా కూడా రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. నాచురల్ స్టార్ నాని నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం అలా మొదలైంది.లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ మాలిక్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో నాని నిత్యా మీనన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పాలి.

ఇలా అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తిరిగి ఫిబ్రవరి 24వ తేదీ 4k వర్షన్ లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా తిరిగి విడుదల కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా మాత్రమే కాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాకు గాను ఏకంగా రెండు నంది అవార్డులు రావడం విశేషం.







