నాని నిజంగానే తాగేశాడట..!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న దసరా( Dasara ) సినిమా కోసం హీరో నాని బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్నాడు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని సినిమాలో చాలా చోట్ల తాగే సీన్స్ ఉన్నాయని.

 Nani Drunked Really For Dasara Movie , Nani  ,  Dasara Movie, Tollywood, Keerthy-TeluguStop.com

ఒక్కోసారి సీన్ బాగా రావడం కోసం డైరెక్టర్ శ్రీకాంత్ నిజంగానే మందు తాగించాడని అన్నారు.సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేందుకు మందు తాగించేశాడని అలా ఒకటి రెండుసార్లు జరిగిందని అన్నారు నాని.

దసరా సినిమా నాని ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెడుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.సినిమాలో ధరణి పాత్రలో నాని తన ప్రాణం పెట్టి నటించాడని అనిపిస్తుంది.

సినిమాలో నానికి ఏమాత్రం తీసిపోని విధంగా కీర్తి సురేష్ నటన ఉంటుందని తెలుస్తుంది.నాని కీర్తి సురేష్( Keerthy suresh ) ఇద్దరు తమ నటనతో ఆడియన్స్ ని మెప్పిస్తారని అంటున్నారు.

మార్చి 30న థియేటర్ లో సందడి షురూ అవుతుందని నాని నమ్మకంగా చెబుతున్నారు.మరి నాని నమ్మకం ఎంతవరకు నిలబడుతుంది అన్నది చూడాలి.

సినిమా చూసిన సెన్సార్ టీం కూడా పాజిటివ్ గా స్పందించినట్టు టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube