శెభాష్ నాని .. అందుకే నువ్వు నాచురల్ స్టార్ అయ్యావ్

హీరో నాని.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీ లో మాములు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా చలామణి అవుతున్నారు.

 Nani Dasara Movie Song In Telangana Slang , Nani Dasara Movie ,telangana Slang,-TeluguStop.com

సాదా సీదా హీరోగా ఉంటె అయన నాని ఎందుకు అవుతాడు.అతడొక నాచురల్ స్టార్ తనదైన నాచురల్ పెర్ఫార్మెన్స్ తో ఇండస్ట్రీ కి నాచురాలిటీ ని అద్ది మంచి హీరోగా ఎదిగాడు.

ఎన్నో కాంట్రవర్సీలు తన చుట్టూ తిరుగుతున్న కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ పెట్టి ఒక్కో సినిమాతో తన కలెక్షన్స్ ని పెంచుకుంటూ పోతున్నాడు.

అనేక మంది స్టార్ హీరోలలో లేని క్వాలిటీ నాని లో ఉంది అది ఏంటంటే ఈ మాండలికంలో సినిమా తీసిన ఆ బాషా లో పట్టు సాధించి అదే భాషలో డైలాగ్స్ చెప్తూ సినిమాను రక్తి కట్టిస్తూ ఉంటాడు.

ప్రస్తుతం దసరా సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రాబోతున్నాడు.ఈ సినిమా తెలంగాణ ప్రాతంలో ఉన్న సింగరేణి గనుల నేపథ్యం లో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఓదెల నరేష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం తో డెబ్యూ చేయబోతున్నాడు.

ఇక ఈ చిత్రం నుంచి తాజాగా ధూమ్ ధామ్ దోస్తాన్ అనే ఒక లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది.ఈ పాట విన్న తర్వాత చాల మంది తెలంగాణ వాదులకు ‘రా’ కొట్టిన కిక్కు ఎక్కిందని చెప్పాలి.ఆంధ్ర పదాలతో ఎన్నో ఏళ్లుగా స్తబ్దుగా మారిపోయిన తెలుగు సినిమా పాటని దుమ్ము దులిపింది ఈ పాట.కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఒరవడి మారుతూ వస్తుంది.ఇక ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా తెలంగాణా జానా పదాలను సినిమాల్లో చొప్పిస్తూ సినిమా ఒరవడి ని మార్చుతూ వస్తున్నారు.

ఇక నాని చేసిన ఈ ప్రయోగం ఖచ్చితంగా మెచ్చుకోవలసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube