'దసరా' కలెక్షన్స్ పరిస్థితి ఏంటి? అక్కడ వేరు ఇక్కడ వేరు!

నాని హీరో గా నటించిన దసరా( Dasara ) చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ ఇంకా కాంతార వంటి చిత్రాలతో పోల్చుతూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇంకా కూడా సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ అవుతున్నాయి.

కానీ దసరా సినిమా కి ఆ స్థాయిలో కలెక్షన్స్ రావట్లేదు.లక్కీ గా తెలుగు రాష్ట్రాల్లో కాస్త పరవాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదు చేసింది.

హిందీ మరియు ఇతర భాషల్లో దసరా చిత్రం మినిమం కలెక్షన్స్ ని నమోదు చేయడం లో చేతులెత్తేసింది.

ఇక తెలంగాణ లో రాబడుతున్నంతగా ఏపీ లో ఈ సినిమా కు కలెక్షన్స్ రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.తెలంగాణ లో విడుదలైన రెండు వారాల తర్వాత కూడా దసరా సినిమా మంచి కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది.దసరా తర్వాత వచ్చిన శాకుంతలం( Shaakuntalam ) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పర్చడం వల్ల కూడా ఈ సినిమా కు మంచి ఆదరణ లభిస్తుంది అని అంతా భావిస్తున్నారు.

Advertisement

ఇక నాని తదుపరి సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయి.ఇదే సంవత్సరం డిసెంబర్ నెల లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు.దసరా సినిమా ఫెయిల్యూర్ కారణంగా నాని( Nani )తదుపరి సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.

అందుకే కాస్త ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.ఆ సినిమా ఆయన పాన్ ఇండియా రేంజ్( Pan India ) లో నాని కి సూపర్ హిట్ అని తెచ్చిపెడుతుందా అంటే అనుమానమే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.నాని కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది.

దాన్ని పెంచుకోవాలని చూడడం మంచి విషయమే.కానీ అందుకోసం మంచి స్క్రిప్ట్ ఎంపిక చేసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నాని ముందు ముందు అయినా పాన్ ఇండియా స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు