సెన్సార్ కట్స్ విషయంలో దసరా రికార్డ్.. ఇన్ని బూతులు ఉన్నాయా అంటూ?

నాని( Nani ) నటించిన దసరా మూవీ( dasara movie ) థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 5 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఇప్పటికే విడుదలైన దసరా మూవీ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని 2023 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం గమనార్హం.

సెన్సార్ సభ్యుల నుంచి దసరా టీమ్ కు ఒకింత భారీ షాక్ తగిలిందని తెలుస్తోంది.మొత్తం 36 చోట్ల సెన్సార్ సభ్యులు కట్స్, అడిషన్స్ చెప్పారని తెలుస్తోంది.2 గంటల 39 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.బోల్డ్ డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ఆ డైలాగ్స్ కు కట్స్ చెప్పారని తెలుస్తోంది.

కొన్ని పదాలు రాయడానికి కూడా ఇబ్బంది పడే విధంగా ఉండటం గమనార్హం.

Advertisement

ఈ బోల్డ్ డైలాగ్స్ సినిమాకు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీలో నాని ఊరమాస్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.ఊతపదాల వాడకం కూడా ఈ స్థాయిలో కట్స్ కు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు సెన్సార్ కట్స్ ద్వారా సినిమాకు సంబంధించిన షాకింగ్ ట్విస్ట్ లీకైంది.

సినిమాలో సూరి అనే ఫ్రెండ్ రోల్ చనిపోతుందని సెన్సార్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది.డెడ్ బాడీని చూపించే షాట్స్ పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది.దీక్షిత్ శెట్టి పోషించిన ఈ పాత్ర స్పెషల్ గా ఉండటంతో పాటు మూవీలో కీలకం కానుందని తెలుస్తోంది.

ప్రముఖ నగరాలకు తిరుగుతూ దసరా మూవీపై అంచనాలు మరింత పెరిగేలా నాని ప్రమోషన్స్ చేస్తుండటం గమనార్హం.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు