మరీ ఇంతటి ఊచకోతను నాని అభిమానులు స్వాగతిస్తారా? లేదా?

నాని( Nani ) సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు.అలాంటి నాని నుండి కాస్త మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు వస్తే పర్వాలేదు.

 Nani Dasara Film Trailer Release And His Look Goes Viral Details, Dasara, Nani,-TeluguStop.com

కానీ ఊర మాస్‌ సినిమాలను నాని చేస్తే మాత్రం ప్రేక్షకులు ఒప్పుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నాని దసరా సినిమా( Dasara movie ) ఊర మాస్ ని మించి ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా దసరా సినిమా ట్రైలర్ విడుదల అయింది.బాబోయ్ మరి ఇంత నాటు నానిని చూడగలమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఏ సినిమాలో కూడా ఈ స్థాయి మాస్‌ ఎలిమెంట్స్.ఊచకోత సన్నివేశాలను చూడలేదు అంటూ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాని నుండి ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీని ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకుంటున్న అభిమానులు ఇలాంటి ఊరమాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను చూస్తారా అనేది అనుమానమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.కంటెంట్‌ విషయంలో కాస్త జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తే తప్పకుండా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.కనుక దసరా సినిమా విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.

నాని మరియు కీర్తి సురేష్ ల( Nani Keerthy suresh ) పాత్రలు కనీసం ఏడాది కాలం పాటు తెలుగు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటాయట.అంతగా కనెక్ట్‌ అయ్యే పాత్రలు అవ్వడం వల్లే దసరా సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అంటూ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల( Director Srikanth Odela ) అంటున్నాడు.కేజీఎఫ్ సినిమా భారీ మాస్ మూవీ.

ఊచకోత విషయంలో టాప్‌ అన్నట్లుగా ఉంది.అయినా కూడా కేజీఎఫ్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

దసరా సినిమా కూడా కేజీఎఫ్ రేంజ్ లో భారీ విజయాలను సొంతం చేసుకోబోతుంది.నాని దసరా సినిమా ను మార్చి 30వ తారీకున థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube