పేరుకే మీడియం రేంజ్ హీరో కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక హీరో మాత్రం స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడానికి అంత సిద్ధం అయిపోతున్నాడు.స్టార్ హీరోలు అనగానే 100 కోట్లకు తక్కువ కాకుండా పారితోషకం అందుకుంటున్నారు.
అయితే మీడియం రేంజ్ లో కూడా చాలామంది స్టార్స్ ఉన్నారు.వారిలో ఎవరు నెంబర్ వన్ స్టార్ హీరోల పక్కన ఉంటారు అని అనుకున్న ప్రతిసారి అందరికన్నా ముందు నాని( Nani ) లిస్టులో ఉంటున్నాడు.
పైగా నాని వరుస సినిమాలను విజయవంతం చేసుకుంటూ తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ వెళుతున్నాడు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నాని ఈరోజు స్టార్ హీరో( Star Hero ) అవ్వడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు.
అయితే నాని ప్రస్తుతం రెమ్యునరేషన్( Nani Remuneration ) చుక్కల్లో ఉందని వార్త వినిపిస్తోంది ఒక మీడియం సినిమాకి సరిపడా బడ్జెట్ ఈ మీడియం రేంజ్ హీరో తీసుకోవడం పై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది దసరా,( Dasara Movie ) ఈ ఏడాది హాయ్ నాన్న( Hi Nanna Movie ) వంటి సినిమాలో విజయంతో మంచి జోరు మీద ఉన్నాడు నాని.ఇప్పుడు సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) సినిమాతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా డి వి వి దానయ్య ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత ఇదే బ్యానర్లో మరో చిత్రానికి కూడా ఇప్పటికే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సాహో దర్శకుడు సుజిత్ తో ( Sujeeth ) తన తదుపరి చిత్రం ఉంటుందని ప్రకటించాడు.ఈ రెండు సినిమాలకు పారితోషకం బాగా పెంచేసినట్టుగా తెలుస్తోంది.డివివి నుంచి ఈ రెండు చిత్రాల కోసం ఏకంగా 50 కోట్ల రూపాయలను తీసుకున్నాడట నాని.మరి యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తోనే ఆయన సినిమాలు మొన్నటి వరకు తెరకెక్కాయి.
ఇప్పుడు అదే రేంజ్ పారితోషకం తీసుకున్నాడు అంటే నాని రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ పెరిగిన పారితోషకం పై చాలామంది మాట్లాడుకుంటున్నారు నాని కచ్చితంగా మినిమం గ్యారంటీ హీరో కాబట్టి ఆమాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు.ఇక సుజిత్ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.ఈ చిత్రం మాత్రమే కాకుండా సేమ్ శ్రీకాంత్ తోనూ అలాగే బలగం వేణుతోనూ సినిమాలను కమిట్ చేశాడు.
ఇక దసరా సినిమా వరకు కేవలం 20 కోట్ల రెమ్యూనరేషన్ తో సరిపెట్టుకున్న నాని ఇప్పుడు 50 కోట్ల వరకు ఎదగడం చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోలు సరసన చేరుతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.







