గతకొంత కాలంనుండి హిట్టు కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూసిన విజయ్ దేవరకొండకి( Vijay Devarakonda ) ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star Movie ) నిరాశే మిగిల్చిందని చెప్పుకోవాలి.ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలా చూపించడానికి ప్రయత్నించారు దర్శకుడు.
సినిమా పాటలు సినిమా విడుదలకి ముందే హిట్ కావడంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.కానీ ఇప్పుడు సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది.

ముఖ్యంగా కొన్ని విషయాల మీద నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.దర్శకుడు మరలా గీత గోవిందం టెంప్లేట్ వాడడంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది.సీన్స్ కూడా రిపీట్ అయినట్టు అనిపిస్తాయి.తరువాత హీరో మిడిల్ క్లాస్ అని పెట్రోల్ కూడా చాలా పొదుపుగా వాడతాడు.కానీ సొంతిల్లు ఉంటుంది.సొంతింట్లో పైన హీరోకి ఒక సపరేట్ రూమ్ ఉండడం కొసమెరుపు.
ఇవే మన లాజిక్కులకు అందవు.

మిడిల్ క్లాస్( Middle Class ) అంటే పేరుకి మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా కదా.అయితే అది ఈ సినిమాలో సరిగా చూపించలేదు.అదేవిధంగా కొన్ని సీన్స్ రాసుకున్న విధానం అయితే అసలు బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సినిమా చూసినవాళ్లు.
అసలు హీరోయిన్ హీరో మీద థీసెస్ రాయడానికి ఎందుకు వస్తుందో, సెంట్రల్ యూనివర్సిటీలో( Central University ) అడ్మిషన్ ఆమెకి ఎలా దొరుకుతుందో కాస్త క్లారిటీగా చెబితే బావుండేదని అంటున్నారు.అంతేకాకుండా చిన్న చిన్న విషయాల మీద కూడా ఈ సినిమాలో కేర్ తీసుకోలేదు అనిపిస్తుంది.
మొదటి సీన్ లో హీరో ఒక దోశ వేస్తాడు.అదేదో పేపర్ దోశ అన్నట్టు, కేవలం మూడు చుక్కల పిండితో హీరో దోశ వేస్తాడు.
పాపం ఆ దోశని గ్రాఫిక్స్ లో చూపించలేక చచ్చారు.

ఇక హీరో ఫారిన్ వెళ్ళాక, కట్టుకొని వెళ్తే అక్కడ మనోడు స్టైల్ చూసి ఫారిన్ వాళ్ళు లుంగీలు కట్టుకుంటారు.ఒకే ఆటో నుండి 9 మంది దిగుతారు.విజయ్ దేవరకొండ ఓ మంచి నటుడు.
అందులో ఎటువంటి సందేహం లేదు.అర్జున్ రెడ్డి లాంటి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడంలో సందీప్ రెడ్డి పాత్ర ఎంత ఉందో, విజయ్ దేవరకొండ పాత్ర కూడా అంతే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
అసలు విజయ్ దేవరకొండ లేకపోతే అర్జున్ రెడ్డి అనే సినిమాని ఊహించుకోవడం కూడా కష్టమే.కానీ ఇటీవల మాత్రం విజయ్ దేవరకొండ సినిమాల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కనిపిస్తున్నారు.
విజయ్ పోషిస్తున్న పాత్రలు మాత్రం కనిపించట్లేదు అనడంలో సందేహమే లేదు.







