జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా పంచ్ ప్రసాద్( Punch Prasad ) మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా పంచ్ ప్రసాద్ మాత్రం ఈటీవీ, ఈటీవీ ప్లస్ ఛానెళ్లలోని ప్రోగ్రామ్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు.
కిడ్నీ సమస్యల వల్ల కొంతకాలం పాటు బుల్లితెరకు దూరమైన పంచ్ ప్రసాద్ ఆ సమస్యల నుంచి కోలుకుని మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.పంచ్ ప్రసాద్ తన భార్య గురించి పంచ్ ప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పంచ్ ప్రసాద్ భార్య పేరు సునీత( Sunitha ) కాగా ఒకప్పుడు నా భార్య నా పంచ్ లను ఇష్టపడేదని ఇప్పుడు మాత్రం నేను వేసే పంచ్ లను ఛీ కొడుతోందని పేర్కొన్నారు.నేను ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నానని నా భార్య మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధ పడుతోందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
తనకు ఆఫర్లు వస్తే రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమేనని ఆయన కామెంట్లు చేశారు.

పంచ్ ప్రసాద్ ఇకపై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా గడపాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.పంచ్ ప్రసాద్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.పంచ్ ప్రసాద్ ఏ షోతో రీఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.
పంచ్ ప్రసాద్ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి వేణుస్వామి( Venu Swamy ) లక్ష రూపాయల సహాయం చేసిన సంగతి తెలిసిందే.పంచ్ ప్రసాద్ కు సినిమాలలో ఆఫర్లు వస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.

పంచ్ ప్రసాద్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.పంచ్ ప్రసాద్ కు జబర్దస్త్ కమెడియన్లు సైతం తన వంతు సహాయం అందించి అతను కోలుకోవడానికి సహాయపడ్డారు.పంచ్ ప్రసాద్ కోలుకోవడానికి తన భార్య పడిన కష్టం మాత్రం అంతాఇంతా కాదు.







