యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయ్యి కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది.ఆ సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటింది.
ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం అవ్వలేదు.వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్నట్లుగా ఎన్టీఆర్ 30 సినిమా యొక్క అప్‌డేట్ వస్తోంది.
ఇదే సమయంలో ఎన్టీఆర్ గతంలో ప్రకటించిన ప్రశాంత్ నీల్ యొక్క సినిమా పరిస్థితి ఏంటీ అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ను గత రెండేళ్లుగా అనుకుంటున్నారు.
కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా ఈ ఏడాది లోనే విడుదల అవ్వబోతుంది.
ఈ సమయంలో ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే ఉంటుందా లేదంటే మరో హీరో తో ఉంటుందా అనేది తెలియాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

గత కొన్నాళ్లుగా ఈ విషయమై చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఎన్టీఆర్ మరియు కొరటాల శివ సినిమా ఉండబోతుందట.ఆ సినిమా హిట్ అయితే వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాదికి అన్నట్లుగా కన్ఫర్మ్ చేశారు.అంటే ప్రశాంత్ నీల్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భారీ ఎత్తున ప్రశాంత్ నీల్ సినిమా కు స్పందన లభిస్తోంది.

అందుకే ఎన్టీఆర్ 31 ను కచ్చితంగా ఆయన దర్శకత్వంలోనే చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.ఈ ఏడాది చివరి వరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 సినిమా ప్రారంభం అవ్వనుందేమో చూడాలి.







