స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద మూవీ నవంబర్ నెలలో థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
హరి హరీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.యశోద సినిమా సక్సెస్ తో నటిగా సమంత స్థాయి కూడా పెరిగిందనే సంగతి తెలిసిందే.
అయితే వెండితెరపై హిట్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై ఫ్లాప్ గా నిలిచింది.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ఒకటైన ఈటీవీలో ఈ నెల 5వ తేదీన ఈ సినిమా ప్రసారం కాగా ఈ సినిమాకు వచ్చిన రేటింగ్ కేవలం 4.88 కావడం గమనార్హం.ఈ మధ్య కాలంలో ప్రసారమైన చాలా సినిమాల రేటింగ్ లతో పోల్చి చూస్తే ఈ మొత్తం ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.సమంత రేంజ్ కు ఈ రేటింగ్ కు ఏంటని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

సమంత ప్రస్తుతం శాకుంతలంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా శాకుంతలం మూవీ ఈ ఏడాది ఏప్రిల్ నెల 14వ తేదీన రిలీజ్ కానుంది.శాకుంతలం సినిమాతో సమంత కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.సామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా వరుస విజయాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని సామ్ భావిస్తున్నారు.

సమంత త్వరలో ఖుషి మూవీ షూట్ లో పాల్గొననుండగా ఈ సినిమ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో సక్సెస్ సాధించడం విజయ్ దేవరకొండకు కీలకమనే సంగతి తెలిసిందే.లైగర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.







