మణిరత్నం చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్న నందమూరి బ్రహ్మిని...

నందమూరి నట సింహం గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు ( Balayya Babu )ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇప్పటికే ఆయన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న డాకు మహారాజ్ సినిమా( Daku Maharaj ) భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ అటు సినిమా యూనిట్ నుంచి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన అయితే వస్తుంది.

మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని కనుక సాధించినట్టైతే తనకి ఇక తిరుగుండదనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు వరుసగా యాక్షన్ సినిమాలను చేయడమే అతని ఫాన్స్ కు నచ్చుతుందనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి సినిమాలను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం గాను రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోకి ఈ సినిమా దర్శకుడు బాబి, ప్రొడ్యూసర్ నాగ వంశీ,( Director Bobby, Producer Naga Vamsi ) మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చి బాలయ్య బాబుతో కలిసి సందడి చేశారు.ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఈ షోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలియజేశాడు.

అందులో ముఖ్యంగా బాబి బాలయ్య కూతుర్ల గురించి అడగగా బాలయ్య బాబు తన పెద్ద కూతురు అయిన బ్రాహ్మణి( Brahmini )గురించి చెబుతూ ఆమె చాలా ఇంటలిజెంట్ అని చెబుతూనే తనని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసినని చెప్పాడు.

Advertisement

ఇక ఆమె ఇండస్ట్రీకి రాలేదు ముఖ్యంగా మణిరత్నం నుంచి ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ అయితే వచ్చింది.కానీ తను నటించలేనని చెప్పడంతో ఆఫర్ రిజెక్ట్ చేసింది.మరి మొత్తానికైతే తేజస్విని ని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆమె మాత్రం నటిగా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.

కానీ ఈ షోకి ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తుండడం విశేషం.ఇద్దరు కూతుర్లు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ లో బాగా రాణిస్తూ ఉండడం వాళ్ళ నాన్న బాలకృష్ణ అనే పేరు తెచ్చుకోవడం చాలా సంతోషకరం అంటూ బాలయ్య బాబు తన కూతుర్ల గురించి చాలా గొప్పగా చెప్పాడు.

అయితే మణిరత్నం చేసిన యువ సినిమాలో త్రిష పాత్ర కోసం బ్రహ్మిని గారిని తీసుకోవాలని అనుకున్నారట.కానీ ఆమె ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ పాత్రను త్రిష తో చేయించారు.

మరి మొత్తానికైతే డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కి వచ్చిన ఈ సినిమా యూనిట్ సందడి చేయడంతో పాటు ఈ ఎపిసోడ్ ని కూడా చాలా ఆసక్తికరంగా మార్చారు.ఇక మొత్తానికైతే ఇప్పుడు స్ట్రీమింగ్ అయిన అన్ని ఎపిసోడ్స్ కి చాలా మంచి ఆదరణ దక్కుతుందనే చెప్పాలి.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?
Advertisement

తాజా వార్తలు