కన్నడ సినీ నటుడు పునీత్ మరణం యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలోకి నెట్టేసింది.శుక్రవారం ఉదయం తీవ్రమైన గుండె నొప్పితో స్పృహ కోల్పోయి పడిపోయిన పునీత్ ను కుటుంబ సభ్యులు బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు.
అయితే అప్పటికే తన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా అతనిని కాపాడలేకపోయారు.ఈ క్రమంలోనే అతడు మరణించాడనే విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే పునీత్ భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి నేరుగా అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే ఆయనను ఆఖరి చూపు చూడటం కోసం పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు అభిమానులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పునీత్ కుమార్ ఎంతో మంచి స్నేహ బంధం ఉంది.ఈ క్రమంలోనే ఆయన తన మిత్రుడి చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు.
ఈ క్రమంలోనే అక్కడికి వెళ్ళిన బాలకృష్ణ మొదటిగా పునీత్ సోదరుడు శివరాజ్ ను కలిసి ఎంతో భావోద్వేగం అయ్యారు.అనంతరం పునీత్ భౌతిక కాయానికి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన బాలక్రిష్ణ అతనిని చూడగానే తీవ్ర భావోద్వేగానికిలోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే బాలకృష్ణకు పునీత్ కుమార్ ఎంతో మంచి స్నేహ బంధం ఉందని తెలుపుతూ గతంలో వీరు కలిసి ఉన్నటువంటి ఒక వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.