లోకేష్ ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు.హిందూపురం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన తరువాత బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు.
ఒక దశలో చంద్రబాబు విదేశాలకు వెళ్లిన సమయంలో బాలకృష్ణ బాబు సీట్లోనే కూర్చుని అందరిని ఆశ్చర్య పరిచాడు.అది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.
అప్పటిలో ఈ వ్యవహారాన్ని బాలయ్య బాగానే సమర్థించుకున్నాడు.ఇక ఆ తర్వాత బాలయ్య హవా కాస్త టీడీపీలో తగ్గుతూ వచ్చింది.
దీనికితోడు బాలయ్య అక్రమాలు పెద్ద ఎత్తున వెలుగులోకి రావడం, దీని కారణంగా వివాదాస్పదం కావడం, హిందూపురం కేంద్రంగా బాలయ్య చుట్టూ అనేక వివాదాలు చోటు చేసుకోవడం వంటివి ఎన్నో జరిగినా, మళ్ళీ రెండోసారి బాలయ్య 2019 ఎన్నికల్లో అదే హిందూపురం నుంచి గెలిచాడు.కాకపోతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కి వెళ్ళింది.
దీంతో బాలయ్య సైలెంట్ గా ఉంటూ వచ్చారు.
అసెంబ్లీలోనూ తెలుగుదేశం పార్టీ పై తీవ్రస్థాయిలో అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ,ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబును సైతం తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ వచ్చినా, మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, సభలోనే ఉన్న బాలయ్య మాత్రం నోరు మెదపకుండా సైలెంట్ గానే ఉంటూ వచ్చారు.
కానీ కొద్ది రోజులుగా బాలయ్య స్పీడ్ పెంచారు.చంద్రబాబు లోకేష్ ను ఉద్దేశించి తీవ్రపదజాలంతో విమర్శిస్తూ వస్తున్నారు.దీనిపైనా, మంత్రి కొడాలి నాని కి పరోక్షంగా హెచ్చరికలు చేశారు.తరుచుగా హిందూపురం నియోజకవర్గం లోనే బాలయ్య పర్యటిస్తూ, అక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటించేందుకు బాలయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల్లో ఉత్సాహం పెంచే విధంగా బాలయ్య బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నారట.అయితే అకస్మాత్తుగా బాలయ్య ఇంతగా యాక్టివ్ గా కావడానికి కారణాలు చాలా ఉన్నాయట.ప్రస్తుతం తన అల్లుడు లోకేష్ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వయసురీత్యా మరెంతోకాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేకపోవడం, రానున్న రోజుల్లో లోకేష్ కు టీడీపీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉండడం, ఆయన సామర్థ్యం పై పార్టీ జనాల్లో నమ్మకం లేకపోవడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తాను ముందుకు నడిపించాల్సిన అవసరం వస్తుందేమో అనే ఆలోచనతో బాలయ్య ముందుగానే అన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు.అసలు బాలయ్య సీఎం అవ్వాలనే కోరికతో ఎప్పటి నుంచో ఉన్నారని, కానీ సరైన సమయంలో దాన్ని బయటపెట్టాలని చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
లోకేష్ ఒక్కరే నడిపించలేరు అని, అందుకే బాలయ్య లోకేష్ కు, పార్టీకి వెన్నుదన్నుగా ఉండే ఉద్దేశంతో స్పీడ్ పెంచినట్టు సమాచారం.