రూ.5 లకే గుడ్డుతో భోజనం.. ఎక్కడో తెలుసా?

ఎన్నికలు వచ్చే ముందు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రజల నుండి అభిమానాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారు.

ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని చేస్తుంటారు.

ఎక్కువ ఓట్లు ఆశించడానికి పలురకాల సదుపాయాలను కూడా అందిస్తుంటారు నాయకులు.ఇది అన్ని చోట్ల జరిగే రాజకీయమే.

కొందరు నాయకులు ప్రజలకు ఆర్థికంగా కాకుండా వాళ్లకు కావాల్సిన సదుపాయాలను అందిస్తుంటారు.ఇదిలా ఉంటే ఎన్నికల సందర్భంగా ఐదు రూపాయలకే గుడ్డుతో భోజనం సదుపాయాన్ని కలిగిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతున్నాయన్న ప్రచారాలు వినిపిస్తుండగా పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓ కొత్త పథకాన్ని ప్రారంభించారు.ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది భోజనం కాబట్టి అందరి కడుపులు నింపడానికి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్ర పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఏర్పాట్లు చేశారు.

Advertisement

మా అనే పథకంతో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఓ ప్లేట్ భోజనానికి ఐదు రూపాయలు ఉండగా అందులో అన్నం, పప్పు, కూరగాయల తో పాటు గుడ్డు కూర పెట్టడానికి నిర్ణయించుకున్నారు.ఇక ఈ భోజనానికి 5 రూపాయల ఖర్చు కాగా.మిగతా రూ.15 ల సబ్సిడీని ఆ రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకుంటుంది.ఈ భోజనం సరఫరాను మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు అందించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ సదుపాయాన్ని రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయగా.రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆహార సదుపాయాలను, కిచెన్ ల ఏర్పాట్లను స్వయం సహాయక బృందాలు నిర్వహించనున్నాయి.

దీనివల్ల పేద ప్రజలకు అందుబాటు ఖర్చులతో భోజనం అందించడం మంచి ఆలోచన అంటూ పలువురి నాయకుల ప్రశంసలు వస్తున్నాయి.ఇక ఇలాంటి సదుపాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇక భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న వాదనలు మాత్రం అంతా ఇంతా కాదు.

Advertisement

తాజా వార్తలు