2 రూపాయలకే బిర్యానీ ఇస్తున్న నందమూరి బాలకృష్ణ

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు.

 Nandamuri Balakrishna Giving Biryani For 2 Rupees , Nandamuri Balakrishna , Tdp-TeluguStop.com

నాన్ వెజ్ ఫంక్షన్ ఉందంటే  ఇంటిల్లిపాది పరుగులు తీస్తారు.అదే బిర్యాని రెండు రూపాయలకే  వస్తుంటే  అందరూ పరుగులు తీశారు.

  బిర్యానీ తో పాటు గుడ్డు, స్వీటు ను   నిర్వాహకులు ఇవ్వడంతో  లొట్టలు వేసుకొని మరీ తిన్నారు.ఈ విందును హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ  అందించారు.

శ్రీ సత్య సాయి జిల్లా  హిందూపురంలో స్వర్గీయ  ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా,  అలానే ప్రతిరోజు  నిరుపేదలకు 2 రూపాయలకే  భోజనం అందించేందుకు బాలయ్య ఏర్పాటు చేసిన అన్న భోజనశాల  200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రు 2/- కే   500 మంది పేదలకు చికెన్ బిరియాని, గుడ్డు, స్వీట్  ను  ప్రభుత్వ ఆసుపత్రి గేటు సమీపంలో తెదేపా నాయకులు ఏర్పాటు చేశారు.  బిర్యానీ విందును ఆరగించేందుకు ప్రజలు బారులు తీరారు.

  తిన్నవారంతా జై జై బాలయ్య అంటూ జేజేలు కొట్టారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube