2 రూపాయలకే బిర్యానీ ఇస్తున్న నందమూరి బాలకృష్ణ
TeluguStop.com
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.
చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు.నాన్ వెజ్ ఫంక్షన్ ఉందంటే ఇంటిల్లిపాది పరుగులు తీస్తారు.
అదే బిర్యాని రెండు రూపాయలకే వస్తుంటే అందరూ పరుగులు తీశారు. బిర్యానీ తో పాటు గుడ్డు, స్వీటు ను నిర్వాహకులు ఇవ్వడంతో లొట్టలు వేసుకొని మరీ తిన్నారు.
ఈ విందును హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అందించారు.శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా, అలానే ప్రతిరోజు నిరుపేదలకు 2 రూపాయలకే భోజనం అందించేందుకు బాలయ్య ఏర్పాటు చేసిన అన్న భోజనశాల 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రు 2/- కే 500 మంది పేదలకు చికెన్ బిరియాని, గుడ్డు, స్వీట్ ను ప్రభుత్వ ఆసుపత్రి గేటు సమీపంలో తెదేపా నాయకులు ఏర్పాటు చేశారు.
బిర్యానీ విందును ఆరగించేందుకు ప్రజలు బారులు తీరారు. తిన్నవారంతా జై జై బాలయ్య అంటూ జేజేలు కొట్టారు.