ఈ రోజు మన తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.మన ఇండస్ట్రీలోని మహా శిఖరం అస్తమించింది.
లేవడం లేవడమే కృష్ణ గారి మరణ వార్త వినడం తెలుగు ప్రేక్షకులు జీర్ణించు కోలేక పోతున్నారు.సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు అనే వార్త పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఈయన లేరు అనే లోటు టాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా పెద్ద లోటుగానే మిగిలిపోనుంది.
ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.
ఈ ఏడాది లోనే ఈయన కుటుంబం నుండి ముగ్గురిని పోగొట్టు కోవడంతో మహేష్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది అనే చెప్పాలి.దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా మహేష్ కష్టానికి బాధ పడుతున్నారు.
ఇదిలా ఉండగా కృష్ణ మరణానికి సంతాపం తెలుపుతూ టాలీవుడ్ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.తాజాగా నందమూరి బాలయ్య కూడా ఈయన మరణవార్తపై స్పందించారు.
”కృష్ణ గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అని.ఆయన చిత్రసీమలో కొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించుకుని ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు అని.నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత ఆయన ఇండస్ట్రీకి అందించిన సేవలు మరువలేనివి అని కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నాన్నగారు, కృష్ణ గారు కలిసి అనేక చిత్రాలకు పని చేసారని.ఆయనతో నేను కూడా నటించడం మర్చిపోలేని అనుభూతి అని కృష్ణ గారు లేని లోటు సినీ పరిశ్రమకు, అభిమానులకు ఎప్పటికి తీరని లోటు అని ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని.ఇటీవలే సోదరుడి, మాతృమూర్తి ఇందిరా దేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న నా సోదరుడు మహేష్ బాబుకు కష్ట కాలంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని బాలయ్య ఎమోషనల్ పోస్ట్ చేసారు.







