Krishna pan world movie : 50ఏళ్ళ క్రితమే.. కృష్ణ పాన్‌ వరల్డ్‌ సినిమా..! 45 చిత్రాల్లో ఒకే హీరోయిన్...

ఇప్పుడు మనం పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాలంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం.కానీ సూపర్‌ స్టార్‌ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్‌ వరల్డ్‌ సినిమా తీసి టాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లాడు.

 50 Years Ago Krishna Pan World Movie, Krishna, Pan World Movie, Mosagallaku Mosa-TeluguStop.com

కృష్ణ హీరోగా కే.ఎస్‌.ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’.‘మెకన్నాస్‌ గోల్డ్’, ‘ఫర్‌ ఏ ఫ్యూ డాల్లర్స్‌’ మోర్‌ వంటి ఇంగ్లీష్ సినిమాలు అప్పట్లో మద్రాస్‌లో మంచి కలెక్షన్‌లు సాధించాయి.

దాంతో కృష్ణ మనం కూడా ఇలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని భావించాడు.అనుకున్నదే తడువుగా రచయిత ఆరుద్ర గారిని పిలిచి తెలుగు నేటీవిటీకి తగ్గట్లు కథ రాయమని చెప్పారు.

‘ద గుడ్‌, ద బ్యాడ్‌ అండ్‌ అగ్లీ’ అనే హాలీవుడ్‌ మూవీ ఇన్సిరేషన్‌తో ఆరుద్ర ఈ సినిమా కథను రాశారు.

ఈ చిత్రాన్ని కృష్ణ తన సొంత బ్యానర్‌ అయిన పద్మాలయ స్టూడీయోస్‌పై నిర్మించాడు.అప్పట్లోనే ఈ చిత్రానికి రూ.8 లక్షల బడ్జెట్‌ అయింది.మొదట ఈ సినిమాకు అదృష్ట రేఖ అనే టైటిల్‌ను అనుకున్నారు.అయితే ఈ సినిమాకు ఆ పేరు అంతగా బాగాలేదని అనుకుని మోసగాళ్ళకు మోసగాడు అనే పేరును పెట్టారు.1971 ఆగస్టు 27లో తొలి తెలుగు కౌబాయ్‌ చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది.బాక్సాఫీస్‌ దగ్గర ఈ చిత్రం 50కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత 50కోట్ల గ్రాస్‌ సాధించి మూడో హీరోగా కృష్ణ నిలిచాడు.ఈ చిత్రం తమిళంలో ‘మొసక్కరనుక్కు మొసక్కరన్‌’, హిందీలో ‘గన్‌ఫైటర్‌ జానీ’ పేరుతో రిలీజైంది.

ఇక్కడ ఈ సినిమాకు అనూహ్య స్పందన రావడంతో, కృష్ణ ఈ సినిమా నిడివిని తగ్గించి ‘ది ట్రెజర్‌ హంట్‌’ పేరుతో ఇంగ్లీష్‌ వెర్షన్‌లో రిలీజ్‌ చేశాడు.అక్కడ కూడా ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది.

ఇలా తెలుగు నుండి ఇంగ్లీష్‌కు డబ్‌ అయిన ఫస్ట్‌ ఇండియన్‌ మూవీగా రికార్డు సృష్టించింది.

Telugu Jayaprada, Krishna, Pan, Shrirajeshwari, Tollywood-Latest News - Telugu

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణ ఎందరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు.ముఖ్యంగా ఆయన సరసన ఎక్కువ సినిమాల్లో చేసిన ఘనత జయప్రదదే.కృష్ణతో కలిసి ఆమె ఏకంగా 45 చిత్రాల్లో నటించారు.

ఒక హీరోతో ఓ హీరోయిన్ ఇన్ని చిత్రాల్లో నటించడం ఓ రికార్డు.ఆ ఘనత జయప్రదకే దక్కింది.

ఎన్నో సందర్భాల్లో కృష్ణ తనకు అందించిన సహకారం గురించి జయప్రద గుర్తు చేసుకున్నారు.తాను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు కృష్ణ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని ఆమె చెపుతుంటారు.

బాపు దర్శకత్వం వహించిన విజయా సంస్థ నిర్మించిన ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ చిత్రంలో కృష్ణ సరసన జయప్రద తొలిసారి నటించారు.ఈ చిత్రం ఊహించినంత విజయం సాధించలేనప్పటికీ కృష్ణ ఆమెకు అండగా నిలిచారు.

తన తదుపరి చిత్రాల్లో వరుస ఆఫర్లు ఇస్తూ ఆమెను స్టార్ హీరోయిన్ ను చేశారు.వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి.

వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటాయి.ఏడాదికి 19 చొప్పున 300 సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ.

మూడు షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు చేసేవారు కృష్ణ.కానీ ఇప్పుడు ఇలా సూపర్ స్టార్ క్రిష్ణ మరణం సినీ పరిశ్రమనే కాకుండా ఆయన అభిమానులను శోక సంద్రంలో నెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube